06-01-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'గీతాంజలి' సినిమాకు ఈ చిత్రం సీక్వెల్గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే కొత్త సంవత్సరం కానుకగా మూవీ నుంచి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు హీరో సునీల్ ఫస్ట్ లుక్లను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పాడుబడిన బిల్డింగ్ లో అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ, సునీల్ ఉండగా.. పైకి దేనినో సీరియస్ చూస్తున్నట్లు ఉంది.
ఇక వీళ్ళందరూ ఎందుకు అలా చూస్తున్నారు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎంవీవీ సినిమాస్ బ్యానర్ తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.