08-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 8: కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీ కాలనీలో మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. నలుగురు స్నేహితులతో సోమవారం తెల్లవారుజాము వరకు ఫుల్లుగా మద్యం సేవించి కారును డ్రైవ్ చేశారు.
మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు.