08-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 08: సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ఆందోళన విజయవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బందర్ రోడ్డులో మున్సిపల్ కార్మికుల డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె భాగంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్రించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సిపిఎం నేత సిహెచ్. బాబురావుతో పాటు పలువురు కార్మిక నేతలను, మహిళలను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మున్సిపల్ యూనియన్ గౌరవాద్యక్షుడు కాశీనాథ్ తదితర నాయకులు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించగా, కొందరిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసిన మరికొంతమంది కార్మికులను హనుమాన్ పేట కళ్యాణ మండపంలో పెట్టారు. అయినా వారి ఆందోళన కొనసాగింది. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. ఆందోళన ఆపేది లేదని, కొనసాగిస్తామని నేతలు హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని జరిగిన నిరసన కార్యక్రమాన్ని నిర్భంధంతో అణచవేసే చర్యలు మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ కి వెళ్తున్న మున్సిపల్ కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వారికి మద్దతు తెలిపిన సిపిఎం నేతలు పి మధు, వి శ్రీనివాసరావు, సిహెచ్ బాబూరావు, తదితరులు. నిరవధిక సమ్మె 14 రోజులుగా చేస్తున్నా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం లేదని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
నంద్యాల, బేతంచెర్ల, డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు 500 మందిపైగా మున్సిపల్ కి కార్మికులు ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా మున్సిపల్ కార్మికుల 14వరోజు నిరవధిక సమ్మెలో భాగంగా మార్కెట్ సెంటర్ నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మునిసిపల్ కార్మికులు భైఠాయించారు. శానిటేషన్ వర్కర్ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని సిఐటియు నాయకులు నందీశ్వర రావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించాలని శానిటేషన్ వర్కర్స్ చేస్తున్న సమ్మె సోమవారం 13వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం నగర పంచాయతీ కార్యాలయాన్ని శానిటేషన్ వర్కర్లు ముట్టడించారు.
ఈ సందర్భంగా నందీశ్వర రావు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు యేసమ్మ లు మాట్లాడుతూ కనీస వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, చనిపోయిన వర్కర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఎన్నికల ముందు జగన్ కనీస వేతనం ఇస్తానని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని హామీ నేటికీ హామిగానే ఉండిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న హెల్త్ అలివేన్స్ కోవిడ్ కాలంలో బకాయిలో ఉన్న ఆరు నెలల వేతనాలను తక్షణం విడుదల చేయాలని అంతవరకు సమ్మె విరమించేది లేదన్నారు. దీని పై కమిషనర్ ఎం సత్యనారాయణ మాట్లాడాతూ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళుత అని స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్కర్స్ లోవబాబు, బి సత్యవతి, సిహెచ్ రామారావు, జి రాజులు,రాజమోహన్,రాములమ్మ, లక్ష్మి, పార్వతి, పైడిరాజు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ, మున్సిపాలిటీకి చెందిన కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా ర్యాలీగా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ ముందు బైఠాయించి నేషనల్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.