08-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 08: తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై సైబర్ నేరగాళ్లు మోసాలు చేసే అవకాశం ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి అన్నారు. సోమవారం నాడు శివ మారుతి మీడియాతో మాట్లాడుతూ.. ‘దరఖాస్తు దారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి లింకులు క్లిక్ చేయొద్దు, ఓటీపీలు చెప్పొద్దు జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదలడం లేదు. అప్రమత్తంగా లేకుంటే మోసాల బారిన పడతారు.
మోసపోయిన బాధితులు వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని శివ మారుతి పేర్కొన్నారు.