09-01-2024 RJ
సినీ స్క్రీన్
చిత్రరంగంలో పుకార్లు సమజమే. కొన్ని పుకార్లు అప్పుడప్పుడూ నిజం అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు వీటిని తట్టుకోవడం కూడా కష్టమే. టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకురాగా..
రష్మిక యానిమల్ తో ఏకంగా బ్లాక్ బస్టర్ నే ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఇద్దరూ గతకొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
దీనికి తోడు అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చుతున్నారు. ఇదిలావుంటే.. వీరికి సంబధించిన మరో న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. ఈ టాలీవుడ్ స్టార్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట.
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి రెండవ వారంలో ఇద్దరూ తమ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన అభిమానులు ఇది ఫేక్ న్యూస్ అని.. మరికొందరు వీరిద్దరి జోడి బాగుంటుందని, క్యూట్ పెయిర్ అని కామెంట్స్ చేస్తున్నారు.