09-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 09: ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ కు పట్టున్న కరీంనగర్ ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ వేడి అందుకుంది. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్ అని తేలిపోయింది. గత ఎనకల్లో బండి విమర్శలు ప్రధానంగా బిఆర్ఎస్ అవినీతిపైనే సాగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
ఇప్పుడు కరీంనగర్ పోరుగల్లుగా మారుతోంది. ఎన్నికల నాటికి ఇది మరింత ఉధృతం కానుందనడంలో సందేహం లేదు. ఇంతకాలం బిఆర్ఎస్ చెప్పిందే వేదంగా రాజకీయాలు నడిచాయి. అలాగే తెలంగాణ సెంటిమెంట్ తో నెట్టుకొచ్చారు. కానీ ఆ పప్పులు ఉడకవని కాంగ్రెస్ గెలవడంతో రుజువయ్యింది. అందుకే బిజెపి దూకుడు రాజకీయాలు చేపట్టింది. ఎన్నికలకు ముందే బిజెపి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందని భావిస్తున్నారు.