09-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 09: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ కూడా రాయనున్నారు. గాంధీభవన్లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందన్నారు.
ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడం వల్ల ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని జీవన్ రెడ్డి తెలిపారు.