09-01-2024 RJ
తెలంగాణ
జగిత్యాల, జనవరి 09: జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకటరావుపేట శివారులో 63వ జాతీయ రహదారిపై మంగళవారం పెట్రోల్ ట్యాంక్ బోల్తాపడింది. ఓ పెట్రోల్ బంక్ సమీపంల టైరు పేలడంతో ఆయిల్ టాంకర్ బోల్తాపడి పక్కనే ఉన్న స్కాప్ గోదాంకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు మంటలు అంటుకుని పేలిపోయింది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. హైదరాబాదు నుంచి ఉదయం మల్లాపూర్ మండలం రాఘవపేటలోని పెట్రోల్ బంకుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడటంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.