09-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 09: ఓ కంపెనీకి లబ్ది చేకూర్చడం కోసమే ఈ ఫార్ములా రేసు పెట్టారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టిందన్నారు. ఈ ఫార్ములా రేసుతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటని ఆయన ఆయన ప్రశ్నించారు. జనవరి 9వ తేదీ మంగళవారం సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' ఓ కంపెనీకి లబ్ది చేయడం కోసమే ఫార్ములా రేసు పెట్టారు. బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించారు. ఈ రేసుకు రూ.110 కోట్లు కట్టారు. ఫార్ముల ఈ-రేసు రద్దుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మాజీ మంత్రుల వ్యాఖ్యలు అభ్యంతరకరం. ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రతిపైసా ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తాం.
గత ప్రభుత్వ తప్పిదాలను ఖచ్చితంగా సరిచేస్తాం. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఎవరు ఏం చేసినా కూడా చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. తప్పుడుప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు.