09-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 09: బోయిన్ పల్లిలో ఓ గంజాయి ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో జనవరి 9వ తేదీ మంగళవారం బోయిన్ పల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను అడ్డుకుని తనిఖీలు చేశారు. దీంతో రెండు కార్లలో ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్న 130 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
బోయిన్ పల్లి కేంద్రంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం రాజస్థాన్ కు చెందిన జై సింగ్ భాటి,రూప చంద్, ప్రేమ్ కుమార్ అనే ముగ్గురు నిందితులను బోయిన్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్ లో పట్టుబడిన గంజాయి విలువ రూ.32 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు.
పరారైన ధర్మేందర్, మంగిలాల్ అనే మరో ఇద్దరు నిందుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులంతా జీడిమెట్ల షాపూర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.