09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 09: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై వైకాపా అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లైవ్ లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఆయన వివరణ కోరారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగనను కలవనున్నారు. మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ గోరంట్ల మాధవ్కు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సాయంత్రంలోగా వారు సీఎంను కలవనున్నారు. తమ సీట్ల విషయంపై జగన్ తో చర్చించనున్నారు.