ad1
ad1
Card image cap
Tags  

  09-01-2024       RJ

ఎస్మాను ఎత్తేయాల్సిందే.. విశాఖ జెఎసి నేతల ఘాటు హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్

విశాఖపట్టణం, జనవరి 09: అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విశాఖ జేఏసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వైసిపి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ప్రయోగించిన నిరంకుశ ఎస్మా చట్టాన్ని, మున్సిపల్ కార్మికులపై నిర్బంధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ నగరంలో నేడు జైల్ భరో నిర్వహించింది.

బాటా జంక్షన్ వద్ద వందలాది మంది పోలీసులు మోహరించి ? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ కు ప్రదర్శనగా వెళుతున్న ఆందోళనకారులను సుమారు 300 మందిని అరెస్టులు చేయించి పోలీస్ బ్యారెక్స్ లో నిర్బంధించారు. అరెస్టులకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సభలో విశాఖ జిల్లా కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, వైస్ చైర్మన్ ఎం మన్మధరావులు మాట్లాడుతూ ? వైయస్ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులపై ఎస్మాను ప్రయోగించి తన నిరంకుశ పాలనను నిరూపించుకుందన్నారు.

తక్షణమే ప్రభుత్వం ఎస్మా ను ఉపసరించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నదని, కార్మికుల ప్రజాతంత్ర హక్కులను హరిస్తున్నదని నిరంకుశ చట్టాలు, నిర్బంధాలు ఆపకపోతే జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్బంధ పద్ధతులను విడనాడి అంగన్వాడి, మునిసిపల్, సర్వ శిక్ష అభియాన్ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కార్మికులను భయపెట్టి, వేధించి, నిర్బంధ చర్యలకు పూనుకున్న ఏ ప్రభుత్వం, పాలకులు బతికి బట్ట కట్టలేదన్న వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. ఎస్మా చట్టం,నిర్బంధం పై అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాలు మాత్రమే నేడు జైలు భరో నిర్వహించాయని ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే జిల్లాలోని రాజకీయ పార్టీలన్నిటిని, ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జైల్ భరో కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో ? సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే ఎం శ్రీనివాస్, ఆర్కే ఎస్ వి కుమార్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పడాల రమణ, ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శికే మల్లయ్య, ప్రజాపోరు నాయకులు దేవా, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి.మణి, ఐద్వా జిల్లా నాయకులు బి ఈశ్వరమ్మ, కె ప్రభావతి, డివైఎఫ్ జిల్లా నాయకులు కే సంతోష్ కుమార్, కె శ్రావణ్ కుమార్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఎం చంటి, వై అప్పారావు, సిఐటియు జిల్లా నాయకులు ఆర్ఎస్ఎన్ మూర్తి, డి అప్పలరాజు, ఏ నరేంద్ర కుమార్, వి కృఅష్ణారావు, ఎం సుబ్బారావు జి అప్పలరాజు, ఓ అప్పారావు, పి పైడ్రాజు,ఎం రాంబాబు, ఆర్ లక్ష్మణమూర్తి, ఉరుకూటి రాజు, టీ నూకరాజు, కే అప్పలనాయుడు, కే పెంటారావు, ఏఐటియుసి నాయకులు సిహెచ్ కాసుబాబు, శ్యామల తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగం, అసంఘటిత రంగం కార్మికులతో పాటు మహిళలు విద్యార్థులు, యువజనులు, కళాకారులు మేధావులు, దళిత సంఘాలు పాల్గన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP