09-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 09: ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలానగర్ ఫ్లై ఓవర్ పై పడిపోయిన అభయ హస్తం దరఖాస్తుల ట్రాన్స్ పోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బల్దియా చర్యలకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని డిప్యూటీ జోనల్ కమిషనర్ ను కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశించారు.
అనంతరం దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వేటు వేశారు. ఆన్లైన్ ఎంట్రీ చేసే క్రమంలో అనవసరంగా బయటివారికి అప్లికేషన్లు ఇచ్చి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు టీమ్ లీడర్స్ పై వేటు పడింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్, హయత్ నగర్ టీమ్ లీడర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అప్లికేషన్స్ పెట్టుకుంటే, వాటిని జాగ్రతగా అప్లోడ్ చేయాలన్నారు.
ప్రజలకు సంబంధించిన అప్లికేషన్స్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని రొనాల్డ్ హెచ్చరిచారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా అప్లోడ్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. అరుహులైన వారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ఎవరు సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ వినతి చేశారు.
కాగా... బాలానగర్ ఫ్లై ఓవర్ పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దర్శనమిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. ర్యాపిడో వెహికల్ పై దరఖాస్తులను తరలిస్తుండగా అవి రోడ్డుపై పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా గుర్తించడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయని వస్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
దరఖాస్తులు రోడ్డుపాలైన విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ను మంత్రి వివరణ కోరారు. దీనిపై మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగం పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలన్నారు. బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖలలో దొడ్డి దారిన ఉద్యోగులంతా వెళ్లిపోవాలన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి విచారణ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలన్నారు.
అన్ని శాఖల్లో విచారణ జరగాలని తెలిపారు. ఎంపీ సంతోష్ చెల్లి కూడా భూనిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నారని.. అలాంటి వారు కూడా భూమి ఇచ్చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన హయత్ నగర్ సూపరింటెండెంట్ మహేందర్ ను సస్పెండ్ చేశారు. మరో చోట కుత్బుల్లాపూర్ లోనూ అభయహస్తం దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో సంబంధిత అధికారిపై వేటు వేశారు. ప్రజలు.. ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అప్లికేషన్స్ పెట్టుకుంటే.. వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని కమిషనర్ హెచ్చరించారు.
ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అర్హులైన వారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతా యన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తులన ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు.కోటి 25లక్షల అప్లికేషన్లను 30 వేల మంది జనవరి 30 వరకు ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనున్నారు.