09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
నంద్యాల, జనవరి 09: జగన్ ప్రజలపై భస్మాస్మసురుడి హస్తం పెట్టాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాయలసీమకు నీరు ఇవ్వాలని ముచ్చుమర్రి లిప్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశానని, కానీ సీమకు నీళ్లు ఇవ్వని జగన్ రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. 350 టీఎంసీలు రాయలసీమకు ఇవ్వాలని నా కల. గోదావరి నీళ్లు బానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ తీసుకురావాలని నా ఆలోచన. గోదావరి నీళ్లు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు తీసుకొచ్చి అక్కడ నుంచి రాయలసీమకు తరలిస్తే సీమ సస్యశ్యామలం అవుతుంది.
భూమి పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు వేశారు. జగన్ బొమ్మల పిచ్చోడు. మీ ఆస్తికి మీరే వారసులు. కానీ జగన్ భూ రికార్డులు తారుమారు చేసి భూములు కొట్టేయాలని చూస్తున్నాడని హెచ్చరించారు. ఆళ్లగడ్డ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైసీపీది రాతియుగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణయుగం వైపు నడుస్తారో.. రాతి యుగం వైపు నడుస్తారో ఆలోచించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. నందికొట్కూరులో విత్తనాల సరఫరా యూనిట్ ను, ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కును జగన్ ధ్వంసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
325 కోట్లతో జైన్ ఇరిగేషన్ను స్థాపించాను. 15 నెలల్లో ఓర్వకల్లు ఎయిర్ పోర్టును పూర్తి చేసిన ఘనత టీడీపీదే. 6 వేల కోట్లతో ఓర్వకల్లులో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు ఏర్పాటు చేశాను. జగన్ స్నేక్ లా కుట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. రాయలసీమను రత్నాల సీమ కావాలని ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మిస్తే నిరుద్యోగం సమస్య ఉండదు. టీడీపీ అధికారంలోకి రాగానే అలగనూరును పూర్తి చేస్తాను. ఎన్ఎసీజీ భద్రతతో అంగళ్ల దగ్గర పర్యటిస్తుంటే నేను దాడి చేశానని నాపై కేసు పెట్టారు. ఆటో మొబైల్ హబ్ గా చేయాలని చూశాను. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాను.
నిరుద్యోగంలో మనం చివర్లో ఉన్నాం. మూడు నెలలు టీడీవీ జనసేన జెండాలు పట్టి జన చైతన్యం తీసుకురండి. మీ భవిష్యత్తుకు నాది గ్యారెంటీ. వైసీపీ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలుగా మారారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. 'వైసీపీ మంత్రులది సామాజిక యాత్ర కాదు. మోసాలయాత్ర. బీసీ బిడ్డ పెట్రోలు పోసి తగల బెట్టారు.
నంద్యాలలో అబ్దుల్ సలాం వేధింపులు తాళలేక రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకుంటే జగన్ కనీసం పరామర్శించలేదు. జగన్ పాలనలో ఎవరికి రక్షణ లేదు. సామాజిక కేటరైజేశన్ ను ప్రధాని కూడా సమర్ధించారు. జనం వదిలిన బానం ఎక్కడ తిరుగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి నా మిత్రుడు. గతంలో ఇద్దరు కలసి తిరిగాం. 1983లో రాజకీయ విరోధులం అయ్యాం.
వైఎస్ రాజశేఖరరెడ్డి.. వివేకానంద రెడ్డి రామలక్ష్మనులుగా ఉండేవారు. సునీత తన తండ్రిని చంపారని కేసులు పెట్టారు. షర్మిల రాజ శేఖర్ రెడ్డిని చంపారని కేసులు పెట్టినా ఆశ్చర్య పోవాల్సిందే. రిలయన్స్ వాళ్లు చంపారని రిలయన్స్ ఆస్తులపై దాడులు చేయించారు. ఆ తర్వాత నన్ను విమర్శించారు.
ఇప్పుడు వాళ్ళకు కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి మంచి నగరంగా తీర్చుదిద్దుతా. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నాది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తాడంట. మీరేమీ భయపడకండి. మీకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నా. పాన్యం ఎమ్మెల్యే జగన్నాధ గట్టును కొల్లగొట్టారు. నంద్యాల సండే ఎమ్మెల్యే హైవేను మార్చేసి తన భూముల ధరలు పెంచుకున్నాడు.
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెంచర్ల రెడ్డిగా మారారు డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాత సినిమాల్లో నాగభూషణం లాగా పిట్ట కథలు చెప్పి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్లు ప్రజలకు అవసరమా?. టీడీపీ అధికారంలో రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తా.
రా కదలిరా ప్రోగ్రాంకు వచ్చిన జనాన్ని చూస్తుంటే 25 ఏళ్ల క్రితం ఆళ్లగడ్డలో జరిగిన బహిరంగ సభ గుర్తుకొస్తుంది. ఆళ్లగడ్డకు వచ్చిన ప్రజలను చూస్తుంటే నంద్యాల జిల్లాలో ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాయం. ఈ జన సునామీ చూసి తాడేపల్లి వణుకుతోంది. ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు.
శ్రీశైలం మల్లన్న, అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి, బ్రహ్మంగారు ఈ పున్య భూమిలో కొలువైనారు. వీవీ నరసింహారావు ఇక్కడ నుంచి పోటీ చేసి రాష్ట్రపతి అయి ఆర్థిక సంస్కరణలు చేశారు. వీవీ నరసింహారావు సంస్కరణలు నేను అమలు చేశాను. జనవరి తొమ్మిది తేదీన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయిన రోజు. భూమా నాగిరెడ్డిది కూడా ఈ రోజే పుట్టిన రోజు. నాగిరెడ్డికి ఘాట్ లో నివాళులర్పించాను. స్వర్ణయుగం కావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.