09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 09: విజయవాడ ధర్నాచౌక్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలం వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎస్మా ప్రయోగించినా ఆందోళన విరమించని అంగన్ వాడీలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్ వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.
విజయవాడ ధర్నాచౌక్ వద్దకు పోలీసులు వాహనాలతో భారీగా బలగాలు చేరుకున్నాయి. ధర్నా చౌక్ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నోటీసులు ఇచ్చి, వెంటనే శిబిరాలను తొలగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వచ్చారని తెలుసుకుని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.