09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 09: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి కోరామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఎలా పని చేస్తుందో వివరించామని చెప్పారు.
గతంలో దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్సీలు గతంలో సామజిక అసమానతలను ఎదుర్కొనేవారు. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారు. మతం మారినా ఇంకా ఎన్సీలతోనే కలిసి జీవిస్తున్నారు.
జైనులుగా బుద్దులుగా మారిన ఎస్సీలు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల లబ్ది పొందుతున్నారు. ఎస్సీలకు ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేశామని మేరుగ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీలో 12 శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని, సీఎం జగన్ లోతైన ఆలోచనాసరళి సత్ఫాలితాలను చూపిస్తోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ స్కీమ్ లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకృష్ణ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి.
చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. బడుగు బలహీ వర్గాలను సీఎం జగన్ కు దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదని మంత్రి విమర్శించారు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు.175 నియోజక వర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం లేదు.
2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రీ కొడుకులు అవినీతి పరులని స్వయంగా చెప్పాడు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ త్వరలో ఆవిష్కరించనున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారని నాగార్జున ప్రశ్నించారు.