09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 09: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరేళ్ల కింద రాజ్యసభకు ఎంపికైన వారిలో వైఎస్సార్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ లు ఉన్నారు. వీరి పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుత సమీకరణాల మేరకు మూడు స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం ఉంది.
ఖాళీ అయ్యే వారి స్థానంలో ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం జగన్.. వారిలో ఒక ఎస్సీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. గతంలో రాజ్యసభ సభ్యుల ఎంపికలో బీసీలకు పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ.. ఈ సారి ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసినట్టు తెలిసింది. త్వరలో ముగ్గురు పేర్లను వైఎస్సార్సీపీ ప్రకటించనుంది.