09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 09: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సమావేశమయ్యారు. సీఎంతో పలు అంశాలపై గోరంట్ల మాధవ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవలే హిందూపురం పార్లమెంట్ ఇన్ఛార్జీ నుంచి గోరంట్లను సీఎం జగన్ తప్పించారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఏదో తెలిపారు. సీటు విషయంలో సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. హిందూపురం ఎంపీ సీటు ఇప్పటికే వేరొకరికి ప్రకటించారు. నేను ఇంకా మాట్లాడేందుకు ఏమిలేదు.
సీఎంను ఎప్పుడు కలిసినా మాట్లాడేది ఏముంటుంది. నాకు ప్రత్యామ్నాయం ప్రాసెస్లో ఉంటుందని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. ఇకపోతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జీ పోరు వ్యవహారం తాడేపల్లికి చేరింది. ఇటీవలే విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జీగా మల్లాది విష్ణును సీఎం జగన్ తప్పించారు. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జీగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను సీఎం నియమించారు. ఇన్ఛార్జీ నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలక బునారు.
వైసీపీనీ వీడేందుకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సిద్ధమయ్యారు. తన అనుచరులను రాజీనామాలకు మల్లాది విష్ణు సిద్ధం చేశారు. మల్లాది విష్ణును వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. మల్లాది విష్ణును ప్రాంతీయ సమన్వయకర్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కలిసి చర్చలు జరిపారు. మల్లాది విష్ణును సీఎం జగన్ వద్దకు నేతలు తీసుకువచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఇద్దరూ కలసి ఉండేలా సీఎం చర్చలు జరుపుతున్నారు.