ad1
ad1
Card image cap
Tags  

  10-01-2024       RJ

తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి దావోస్ పర్యటన

తెలంగాణ

హైదరాబాద్, జనవరి 10: తెలంగాణలో అధికారం చేపట్టాక పాలనలో దూకుడు మొదలు పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక విధానంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. అలాగే పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి... దావోస్ పర్యటనకు వెళ్తున్నారు.

దావోస్ లో నిర్వహించనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా సిఎంవో విడుదల చేసింది. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఆయన పర్యటిస్తారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. దావోస్ లో నిర్వహించనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. దావోస్లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమార మంగళం బిర్లా, గౌతమ్ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు.

కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో దావోస్ లో జరగనున్న సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. వాళ్లతోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి వి. శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్, ముఖ్య భద్రతాధికారి తస్ ఫీర్ ఇక్బాల్, ఉదయ సింహా, గుమ్మి చక్రవర్తి వెళ్తున్నారు.

దావోస్ లో నాలుగు రోజుల పాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఏడాది జనవరి మూడో వారంలో చివరి డబ్ల్యూఈఎఫ్ పర్యటన జరగగా... అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం హాజరైంది. ఆ సమయంలో.. కేటీఆర్ సుమారు రూ.21వేల కోట్ల పెట్టుబడులను పొందినట్లు సమాచారం. ఈ ఏడాది తెలంగాణలో విదేశీ కంపెనీలు పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది.

విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను ఈ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించనుంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత వంటి అంశాల గురించి వివరించనున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP