10-01-2024 RJ
తెలంగాణ
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 10: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాల్లో రెండవ రోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో 10 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహించి పలు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే కన్నెపల్లి పంప్ హౌసన్ను సీజ్ అధికారులు చేశారు. మాహదేవ పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సెక్యూరిటీ మధ్య కీలకమైన విజిలెన్స్ అధికారులు భద్రపరిచారు. అర్ధరాత్రి అనంతరం మేడిగడ్డ వద్ద గల ఇరిగేషన్ గెస్ట్ హౌస్ రెస్ట్ తీసుకున్న అధికారులు.. బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి మహాదేవపూర్ డివిజన్ కార్యాలయానికి వచ్చి తనిఖీలను ముమ్మరం చేశారు.