10-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
శ్రీ సత్యసాయి జిల్లా, జనవరి 10: కుప్పంలో బాబును, హిందూపూరంలో బాలకృష్ణను ఓడిస్తామని అక్కడ వైసీపీ బోణీ కొట్టడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం నాడు హిందూపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెద్దగా సమస్యలపై దృష్టి సారించలేదు. రెండు సార్లు బాలకృష్ణ ఇక్కడ శాససభ్యుడిగా ఎన్నికయ్యారు. కుప్పం, హిందూపూర్ రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలాగానే సాధారణంగా ఉంటుంది.
అన్ని సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి. కుప్పంలో ఓడిపోతానని టీడీపీ అధినేత చంద్రబాబు మరో నియోజకవర్గం వెతుక్కుంటున్నారు. ఒకవేళ మరో దగ్గర పోటీ చేస్తే అయన ఓటమి అంగీకరించినట్టే. జగన్మోహన్రెడ్డి లాంటి నాయకుడు టికెట్ ఇస్తే ఊరికే గెలుస్తాం అన్న నమ్మకం ఉంది. అందుకే అనేక మంది టికెట్ కోసం అశ పడుతున్నారు. ప్రజలందరూ ఆయన్ని నమ్ముతారు కాబట్టి సీటు కోసం తాపత్రయపడడం సహజం. టీడీపీకి అభ్యర్థులు లేక... మేము టికెట్ నిరాకరిస్తే ఆ పార్టీ వైపు చూస్తున్నారు. కొన్ని పరిస్థితులు వల్ల ఇక్బాలు పోటీ నుంచి పక్కకి పెట్టాల్సి వచ్చింది. గోరంట్ల మాధవ్కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుంది.
తెలంగాణ తరహాలో ఏపీలో కాంగ్రెస్ లేదు... ఏపీలో డిపాజిట్ లేని పార్టీ కాంగ్రెస్ నాయకులను మార్చినా కాంగ్రెస్ పార్టీ ఏపీలో కోలుకునే పరిస్థితి లేదు' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గతంలో అనంతపురంలో ఒడిపోతాం అన్నారు... కానీ అభ్యర్థులు మార్పు తర్వాత దాదాపు అన్ని స్థానాలు గెలుస్తాం అని అంటున్నారు. మేము ఎక్కడా సచివాలయం సిబ్బందిని ఎన్నికల కోసం వినియోగించలేదు. జగన్మోహన్రెడ్డి రాయలసీమ ద్రోహా? లేదా చంద్రబాబా అనేది రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు.
7 సార్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్పంకు చంద్రబాబు నీళ్లు ఇవ్వలేదు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబు లేఖ రాస్తే జగన్ మంచి మనస్సుతో అది నెరవేర్చారు. అనంతపురంలో శాసనసభ్యులు అక్రమంగా నీరు తీసుకుంటున్న కూడా ఎక్కడా మనం ప్రశ్నించలేదు. చిత్తూరు, కడప జిల్లాలకు రావాల్సిన నీటి వాటా ఒక్కసారి కూడా మాకు అందలేదు. శింగనమల ఎమ్మెల్యే మాటలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. హిందూపూర్లో వర్గ విబేధాలు ఉండవు. కుప్పం, హిందూపురం టీడీపీ కంచుకోటలు కాదు... అవి పగలడం ఖాయం' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.