ad1
ad1
Card image cap
Tags  

  10-01-2024       RJ

పిసిసి చీఫ్ పదవిని కొత్తవారికి అప్పగించే యోచనలో కాంగ్రెస్ లేదు

తెలంగాణ

హైదరాబాద్, జనవరి 10: ఇప్పటికిప్పుడు తెలంగాణ పిసిసి పదవిని మార్చే యోచన అధిష్టానికి లేదు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తరువాత వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు కావడంతో పిసిసి చీఫ్ పదవిని కొత్తవారికి అప్పగించే యోచనలో కాంగ్రెస్ లేదు. అయినా కొందరు పైరవీలు మొదలు పెట్టారు. ఎపిలో మాత్రం అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో అక్కడ షర్మిలను పిసిసి చీఫ్ ను చేస్తారని అనుకుంటున్నారు.

అక్కడ ప్రస్తతు పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ఎప్పటినుంచో పిసిసి చీఫ్ పదవిపై కన్నేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెలరోజులు గడిచాయి. పాలనపరంగా అన్ని విభాగాలపై క్రమంగా పట్టు సాధిస్తున్నారు. సీఎం పదవీతోపాటు టీ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. 2, 3 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

ఆ లోపు టీపీసీసీ చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని విశ్వసనీయ సమాచారం. టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం సీనియర్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ పోస్ట్ రేసులో ముందు వరసలో జగ్గారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు సంగారెడ్డి నుంచి ఓడిపోయారు. లేదంటే మంత్రి పదవీ వరించేదని అతని సన్నిహితులు చెబుతుంటారు. పీసీసీ అధ్యక్ష పదవీ కోసం జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారు.

అధ్యక్ష పదవీ కావాలని అడుగుతున్నారు. పదవీ ఇచ్చేందుకు వెనకాడితే తనకు ఎమ్మెల్సీ పదవీ ఇవ్వాలని జగ్గారెడ్డి అడిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి అవడం ఈజీ అనే సంగతి తెలిసిందే. రేవంత్ ప్రభుత్వంలో మరో ఏడు మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది. అందులో ఒక పోస్ట్ పై జగ్గారెడ్డి కన్నేసినట్టు తెలుస్తోంది. మెదక్ లోక్ సభ నుంచి కూతురు జయారెడ్డి లేదంటే సతీమణి నిర్మలకు సీటు ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది.

జగ్గారెడ్డి తర్వాత రేసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉంటారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో మంత్రి పదవీ మిస్సయ్యింది. తప్పకుండా బెర్త్ దక్కేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ మంత్రిగా సీఎం రేవంత్ అవకాశం ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణలో తీసుకుంటారనే గ్యారంటీ లేదు. టీ పీసీసీ చీఫ్ పదవీ వైపు జీవన్ రెడ్డి చూస్తున్నారు. వీరిద్దరితోపాటు గడ్డం వివేకానంద, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా టీ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం వినిపిస్తున్నాయి.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP