11-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 11: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం ఈనెల 18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. దీనికి షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ప్రముఖులకు స్వయంగా ఆహ్వాన పత్రాలు అందచేస్తున్నారు. ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసైకి ఆహ్వానాలు అందించారు. అలాగే షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రమంలోనే షర్మిల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అలాగే మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని సైతం షర్మిల ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడి వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించాలని కోరారు.