11-01-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జనవరి 11: తెలంగాణలో 40 నుంచి 50లక్షల జనాభా కలిగి ఉన్న గోర్ బంజారాల ఆరాధ్య దైవం క్రాంతి కారి సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15వ తేదీన సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని గోర్ బంజారాలు కోరారు. ఈ మేరకు గురువారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆ రోజును సాధారణ సెలవు దినంగా ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు, రాస్తారోకోలు, ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని గత ప్రభుత్వాలను డిమాండ్ చేసినా ఫలితం లేదని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అయినా తమ విన్నపాన్ని ఆలకించి తగు చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు.