11-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 11: గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్ తో చంద్రశేఖర్ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు..
తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ వివరించినట్టుగా తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫారమ్ లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.