11-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 11: జగనన్న తోడు పథకం 8 వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం విడుదల చేశారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఏటా 10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్దిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.88.33 కోట్ల వడ్డీ చెల్లించిందని తెలిపారు. 16,73,576 మంది లబ్దిదారులకు రూ.3,373.73 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. ఇవాళ కొత్తగా 86 వేల మందికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. రుణాలు తీసుకున్న వారిలో 95 శాతం మంది తిరిగి చెల్లింపులు చేస్తున్నారని సీఎం జగన్ వెల్లడించారు.