ad1
ad1
Card image cap
Tags  

  11-01-2024       RJ

తెలంగాణలో ఎంపి ఎలక్షన్స్ పై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణ

న్యూఢిల్లీ, జనవరి 11: తెలంగాణలో విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ లోక్ సభ సమన్వయ కర్తలతో ఢిల్లీలో అధిష్టానంకీలక భేటీ నిర్వహించింది. రానున్న ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై సమావేశంలో చర్చించారు నేతలు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తెలంగాణలోని 17 స్థానాలకు..14 మంది కోఆర్డినేటర్లను నియమించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటికి శ్రీనివాసరెడ్డికి రెండేసి లోక్ సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా నేటి సమావేశంలో.. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంపై నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

మొత్తం మీద టార్గెట్ 14 గా పెట్టినట్లు తెలుస్తోంది.. ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం.. మరోవైపు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుండి 13 నుంచి 14 సీట్లు గెలవబోతున్నామని సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.

విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్టు చెప్పారు. ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని నేతలంతా పనిచేస్తామని మరో మంత్రి సీతక్క అన్నారు... త్వరలో అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి నివేదిస్తామని.. ఫిబ్రవరి లోపు ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని చెప్పారు.

నేటి సమావేశంలో ఆయా అంశాలపై రాష్ట్ర నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల్లో కలిసికట్టుగా ఎంపి సీట్లను సాధించాలన్నారు. మంత్రులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి సంబంధించిన పలు విషయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవ్వడంపై ఖర్గే మార్గానిర్ధేశర చేశారన్నారు.

దేశ ప్రజలు కాంగ్రెసు గెలిపించాలని భావిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 కి 17 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. రెండు, మూడు స్థానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉందని అన్నారు.

గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని చెప్పారు. 17 కి 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారెంటీల తోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణలో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని మొదట చెప్పింది తానేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

నల్లగొండ జిల్లా పార్లమెంటు సీటును 3 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపారు. 14 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచు కుంటుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సమన్వయకర్తలను సమీక్షల కోసం ఢిల్లీకి ఆహ్వానించింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే పలు కారణాల వలన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దు అయింది.

దీంతో మొట్టమొదటి పార్లమెంట్ సమీక్షా సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం అయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై తన అభిప్రాయాన్ని అధిష్టానానికి ఇప్పటికే తెలిపినందున రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు అయినట్లుగా తెలుస్తోంది. సీఎం షెడ్యూల్ లో సైతం ఢిల్లీ టూర్ లేదంటున్న సీఎంఓ వర్గాలు ప్రకటించాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై కూడా ఇప్పటికే అధిష్టానంతో చర్చించి అనుమతి తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు.

లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశంలో ఖర్గేతో చర్చించారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే అయ్యారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించారు. లోక్ సభ స్థానాల్లో విజయం కోసం ఎలా చేయాలన్న దానిపై తెలంగాణ మంత్రులకు ఖర్గే సూచించారు.

అలాగే టిక్కెట్ ఆశిస్తున్నవాళ్ల జాబితాను అధిష్టానం ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉంచారు. అభ్యర్థుల్ని పరిశీలించి అధిష్టానం తన నిర్ణయం ప్రకటిస్తుంది. ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి వచ్చాక లోక్ సభ నియోజకవర్గాలకు సమన్వకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారని సమాచారం. ఇదిలావుంటే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పంపించారు.

తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అద్దంకి దయాకర్ పేరును ఎమ్మెల్సీ లుగా ఖరారు చేయాలని సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మైనార్టీ నాయకులకు అవకాశం కల్పించాలని హైకమాండ్ అనుకుంటే.. ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ పేర్లను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే పేర్లను రేవంత్ హైకమాండ్ కు పంపినందున.. వారి నిర్ణయం మేరకే.. నామినేషన్లు వేయనున్నారు. ఇక దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణ విజయంతో ఇప్పుడు ఏపీపై కూడా దృష్టి పెట్టింది.. కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరోవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలో తొలిసారి పర్యటించారు. విజయవాడలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీలో కొత్త చేరికలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. వైసీపీ, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు మాణిక్కం ఠాగూర్ సూచించారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP