11-01-2024 RJ
సినీ స్క్రీన్
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మాగ్ నమ్ ఓపస్ చిత్రం.. టీజర్, పాటలు, ట్రైలర్ కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. హనుమాన్ సంక్రాంతి కానుకగా 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు ప్రకటించగా.. టికెట్లు అన్నీ హాట్ కేక్ అమ్ముడైపోయాయి.
దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారనేది అర్థమవుతోంది. తాజాగా తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ క్రిటిక్ తన రివ్యూని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలో ఏమేం బాగున్నాయో వివరంగా చెబుతూ.. 'హనుమాన్'కు 3.5 రేటింగ్ కూడా ఇచ్చారు. ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ని ప్రేక్షకులకి అందించాడు. హనుమాన్ సినిమా చాలా బాగుంది. ఇందులో డ్రామా, ఎమోషన్స్, విఎఫ్ఎక్స్, పురాణాలకు సంబంధించిన విషయాలతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాని మలిచాడు. గూజ్ బంప్స్ తెప్పించే సీన్లు, అదిరిపోయే క్లైమాక్స్.. ఈ సినిమాకు ప్రధాన బలం.
నేను ఈ సినిమాను ప్రేక్షకులకు రికమెండ్ చేస్తున్నాను. ఆర్టిస్ట్ ల విషయానికి వస్తే.. ఇందులో నటించిన నటీనటులందరూ అసాధారణమైన నటనను కనబరిచారు. తేజ సజ్జా తన పాత్రకు న్యాయం చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ తన మార్క్ ని ప్రదర్శించింది. వినయ్ రాయ్ చాలా భయంకరంగా కనిపించాడు. సముద్రఖని తన సూపర్ ఫామ్ ని కొనసాగించాడు. వెన్నెల కిశోర్ చాలా బాగా చేశాడు. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది.