11-01-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 19ఏళ్ల క్రితం 'ఆర్య' సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే ప్రతిభ కలిగిన దర్శకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2021లో వచ్చిన పుష్ప సినిమాతో ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
రాజమౌళి తర్వాత టాలీవుడ్ సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ఇదిలావుంటే.. నేడు ఈ లెక్కల మాస్టారు పుట్టినరోజు. ఈరోజు ఆయన 53వ వసంతంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా దర్శకుడికి అభిమానులు, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సుకుమార్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్ డే టూ మై జీనియస్ సుక్కు డార్లింగ్ అంటూ బన్నీ రాసుకోచ్చాడు.
దీనితో పాటు 'పుష్ప: ది రైజ్' సెట్స్ నుంచి ఒక చిత్రాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సీక్వెల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.