11-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 11: పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమీర్ పేట డివిజన్ లోని కుమ్మరి బస్తీలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై పర్యవేక్షించారు.
స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుమ్మరి బస్తీకి మంజూరైన వాటర్, డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు.
ఈ పనులు పూర్తయితేనే రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. చేపట్టిన పనులలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ఇందిర, డిఈ మోహన్, వాటర్ వర్క్స్ జిఎం హరి శంకర్, ఏఎంఓహెచ్ డాక్టర్ ప్రవీణ, స్ట్రీట్ లైట్స్ డిఈ కిరణ్మయి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు హన్మంతరావు, జనరల్ సెక్రెటరీ సంతోష్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, టిల్లు, గోపిలాల్ చౌహాన్, హరిసింగ్, ఉత్తమ్ కుమార్, గులాబ్ సింగ్, సుమిత్ సింగ్ తదితరులు ఉన్నారు.