12-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, జనవరి 12: విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం మార్పులు చేస్తున్నామన్నారు. గురువారం 20 అసెంబ్లీ స్థానాల్లో మార్పు చేశామన్నారు. ఇలా చేసిన మార్పుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని సుబ్బారెడ్డి అన్నారు.
చంద్రబాబు వర్గాలను రెచ్చగొట్టి దుష్పచారం చేస్తున్నారన్నారు. ముద్రగడ జనసేనలోకి చేరడంపై తనకు తెలియదని.. అసలు దానిపై అవగాహన కూడా లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కుటుంబంలో అర్హులైన వారు ఉంటే వారికీ సీట్లు ఇస్తున్నామన్నారు. కుటుంబ పరంగా తాము సీట్లు ఇవ్వడం లేదని.. ప్రజాబలం ఉన్న వారికి మాత్రమే సీట్లు ఇస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.