12-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
రైల్వేకోడూరు, జనవరి 12: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. బాలిరెడ్డిపల్లి వైఎస్ఆర్ నగర్ గ్రామానికి చెందిన ఉదయగిరి భార్గవ్ అతని భార్య లక్ష్మీదేవి మృతి చెందారు. మృతులు ఇద్దరూ ఆటోలో వారి గ్రామానికి వెళుతూ రాఘవరాజుపురం వద్ద లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న కోడూరు సిఐ మధుసూదన్ రెడ్డి, కోడూరు ఎస్సై డాక్టర్ నాయక్ మృతదేహాలను తరలించి కేసు నమోదు చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
రాఘవ రాజాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి మృతి చెందిన భార్గవ్, లక్ష్మీదేవి దంపతుల మృతదేహాలను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు,. బోరును విలపిస్తున్న మృతుల బంధువులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరు గురించి సిఐ మధుసూదన్ రెడ్డి కోరముట్లకు వివరించారు.