12-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురం, జనవరి 12: డిమాండ్ల సాధన కోసం గత 32 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల కొనసాగుతోంది. శుక్రవారం జిల్లాలో అంగన్వాడీలు పలు విధాలుగా నిరసన తెలిపారు. మామిడికుదురు తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్ వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా మోకాళ్లపై నిల్చుని, తలపై కుర్చీలతో విన్నుత రీతిలో నిరసన తెలిపారు. నిరవధిక సమ్మెలో రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు చెందిన సుమారు నాలుగు వందలు మంది అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
సంక్రాంతి పండగను పురస్కరించుకుని మహిళలంతా మెయిన్ రోడ్లపై పిండి వంటలు తయారు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. చర్చలు సఫలం కాకపోతే నమ్మెను మరింతకాలం కొనసాగిస్తామని సందర్భంగా వారు తెలిపారు.
మండపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీలుగరిటలతో కంచాల వాయిస్తూ నత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రమోషన్లలలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లకు వేతనాలు పెంచాలన్నారు.
వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. బీమా అమలు చేయాలి. లబ్దిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలన్నారు.
ఆయిల్, కందిపప్పు, క్వాంటిటీ పెంచాలి. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు నూపర్వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు పాల్గొన్నారు. జీతాలు పెంచాలంటూ అంగన్వాడి వర్కర్లు రామచంద్రపురం కే గంగవరం మండలాలకు చెందిన సుమారు నాలుగు వందలు మంది అంగన్వాడి వర్కర్ల సేవలో పాల్గొన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని మహిళలంతా మెయిన్ రోడ్లపై పిండి వంటలు తయారు చేసి నిరసన తెలిపారు.
ప్రభుత్వం మండవయకర్ విడనాడాలని అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం అంగన్వాడి వర్కర్ల కార్యదర్శి ఎం దుర్గమ్మ వరలక్ష్మి జహిరా, దేవి తదితరులు నమ్మెను ఉద్దేశించి ప్రసంగించారు. చర్చలు సఫలం కాకపోతే నమ్మెను మరింతకాలం కొన సాగిస్తామని సందర్భంగా వారు తెలిపారు.