12-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 12: అయోధ్య రాముడి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం సిగ్గు చేటని, రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకమా అనుకూలమా కాంగ్రెస్ చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో సీఐటీడీ (సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) విస్తరణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రామ మందిరం స్థానంలో బాబ్రీ మసీదును నిర్మిస్తే కాంగ్రెస్ లీడర్లు వెళ్లేవారేమో. ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ పాకులాడుతోంది. ఒవైసీకి కోపం వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ బహిష్కరించింది. శాసనసభ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించినప్పుడే కాంగ్రెస్ వైఖరి అర్థమైంది.
పోటాపోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ సర్కార్ ను కాపాడు కునేందుకు ఒవైసీతో అంటకాగుతున్నరు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పడం ఖాయం' అని సంజయ్ అన్నారు.