12-01-2024 RJ
సినీ స్క్రీన్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా కాలంగా వాళ్లు ఎదురుచూస్తున్న కల్కి 2898 సినిమా విడుదలపై స్పష్టత వచ్చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగానే.. కల్కి సినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ సెంటిమెంట్ ను వాడేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి సూపర్ హిట్ అయినా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజైన మే 9న కల్కి ని కూడా రిలీజ్ చేయనున్నారు.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆ లుక్ కల్కి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా కల్కి టీజర్ను కూడా విడుదల చేసి ఫాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన రానుంది.
ఇక కల్కి 2898 సినిమా విషయనికి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో భారీ బ్జడెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా... ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.