13-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 13: రైళ్లలో రద్దీతో ప్రయాణికుల నానాయాతన పడుతున్నారు. ఓ వైపు అయ్యప్ప భక్తులు మరోవైపు సంక్రాంతి రద్దీతో నిబడడానికి కూడా చోటు లేకుండా ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. రైలెక్కితే చాలన్న రీతిలో ప్రయాణికులు వెళుతున్నారు. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లలో నిలబడి ప్రయాణిస్తుండగా.. ప్యాసింజర్ రైళ్లలో నిలబడటానికి కూడా చోటు ఉండటం లేదు.
కాచిగూడ నుంచి చిత్తూరు, బెంగళూరు, యశ్వంత్పూర్, తిరుపతి, కర్నూలు, గుంటూరు, గుంతకల్ ఇలా ప్రతి రైళ్లొనూ ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంది. బస్సుల్లో ఏకంగా ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
రైళ్లకు సంక్రాంతి రద్దీ పెరిగడంతో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో స్థిపరపడినవారు, వివిధ పనులపై వచ్చిన వారు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో మహబూబ్ నగర్ రైల్వే స్టేషను మీదుగా వెళ్లే ప్రతి రైలుకు రెండు రోజులుగా రద్దీ పెరిగింది. గుంటూరు, కర్నూలు టౌన్, చెన్నైఎగ్మూర్ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి.