13-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 13: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల శనివారం ఆయన నివాసంలో కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లి ఆహ్వానం పలికారు.
ఈ నెల 17న ఆమె కుమారుడు రాజారెడ్డి, తన ప్రియురాలు అట్లూరి ప్రియల వివాహం జరగనుంది. సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించానని, ఆయన ఆహ్వానాన్ని అంగీకరించారని చెప్పారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల అన్నారు.
ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని షర్మిల మీడియా ప్రతినిధులకు సూచించారు.