13-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 13: వికారాబాద్ జిల్లాలో టీఎస్ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. అనంతగిరి కొండల్లోని ఆఖరి మూలమలుపు వద్ద అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు రాలేదు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్స్ ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.