13-01-2024 RJ
సినీ స్క్రీన్
రాఖీ సావంత్ చిక్కుల్లో పడింది. ఆమె దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ముంబైలోని దిందోషి కోర్టు ఆ పిటీషన్ ను కొట్టిపారేసింది. జనవరి 8వ తేదీన జరిగిన విచారణలో అదనపు సెషన్స్ జడ్జి శ్రీకాంత్ పై భోంసలే ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారమే ఆ ఆర్డర్ కు చెందిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
తన ప్రైవేటు వీడియోలను రాఖీ సావంత్ లీక్ చేసినట్లు ఆమె మాజీ భర్త అనిల్ దురానీ కోర్టులో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ల ప్రకారం సావంత్ పై అంబోలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.