13-01-2024 RJ
సినీ స్క్రీన్
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' నిర్మాణ దశ నుంచే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికాపడుకోన్ వంటి అగ్ర తారలు ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది.
ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ 'మే నెల 9వ తేదీ మా సంస్థకు సెంటిమెంట్. మేము తెరకెక్కించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి’ 'మహానటి' 'మహర్షి' చిత్రాలు అదే తేదీన విడుదలైన అపూర్వ ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి.
ఆ సెంటిమెంట్ ను పునరావృతం చేస్తూ 'కల్కి' చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం' అన్నారు. కొద్ది మాసాల క్రితం విడులద చేసిన ఈ చిత్ర టీజర్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది.