13-01-2024 RJ
సినీ స్క్రీన్
అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా 'తంత్ర'. ఫస్ట్ కాపీ మూవీస్, బీ ద వే ఫిల్మ్ స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై చిత్రీకరించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను కథానాయిక పాయల్ రాజ్ పుత్, అనసూయ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. 'గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడటం చాలా ప్లస్ అయింది. టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తంత్ర రహస్యమేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది.
కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం' అన్నారు. ఈ సినిమాకు కెమెరా: సాయిరాం ఉదయ్, విజయ్ భాస్కర్ సద్దాల; సంగీతం: ఆర్ఆర్ ధృవన్; సాహిత్యం: అలరాజు; నిర్మాతలు: నరేశ్బిబు పి, రవిచైతన్య; రచన-దర్శకతం: శ్రీనివాస్ గోపిశెట్టి.