14-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 14: నగర వాసులకు మెట్రో రైలు అధికారులు సువర్ణాకాశం కల్పించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెలకు పయనయ్యారు. మెట్రో రైలు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. ఈ క్రమంలోనే అధికారులు హైదరాబాద్ మెట్రోలో మూడు రోజుల అపరిమిత ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎవరైతే మెట్రో కార్డ్ కలిగి ఉంటారో వారు రూ.59 రీఛార్జ్ చేయడం వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని తెలిపారు. పండుగ మూడు రోజులు పాటు మెట్రో హాలిడే కార్డు వర్తిస్తుందని, ఒక్క సారి రీఛార్జ్ చేసుకుంటే ఆ రోజంతా రైలులో ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.