15-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 15: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. జనవరి 16వ తేదీ మంగళవారం ఈడీ ఎదుట హాజరుకావాలని కవితను ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితకు, మార్చిలో సమన్లు జారీ చేసింది. తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కవితను ఇదే కేసులో 2022 డిసెంబర్ లో సీబీఐ ప్రశ్నించింది.
అయితే దీనిపై స్పందించిన కవిత విచారణకు హాజరుకాలేనని ఈడీకు లేఖ పంపింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని లేఖలో పేర్కొంది.