16-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయనగరం, జనవరి 16: సంక్రాంతి పండుగ నేపద్యంలో మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. చాలా మంది ఇళ్ళల్లో మంగళవారం మాంసం వంటలు వండుకొని తింటారు. ఈ నేపద్యంలో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ఒక్కసారిగా మాంసం ధరలను అమాంతంగా పెంచేశారు. మటన్ కేజీ 800 నుంచి 900 కి, చికెన్ 160 నుంచి 200, 240కి పెరిగిపోయాయి. చేపలు 120 నుంచి 150 కి, నాటు కోడి మాంసంకి మరింత గిరాకీ పెరిగిపోయింది.
కేజీ మాంసం 700 నుంచి 1000 కి చేరిపోయింది. దీంతో కొనుగోలు దారుల బెంబేలెత్తి పోతున్నారు. ధరలు పెరిగిన తప్పదు కాబట్టి ఇదే అదునుగా వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ధరలు పెరిగినప్పటికీ పండగ కావడంతో ఉదయం 5 గంటల నుంచి చికెన్, మటన్, చేపలు మార్కెట్లు జనంతో నిండిపోయాయి. గంటల కొద్దీ ఉంటే తప్ప కేజీ మాంసం దోరకని పరిస్థితి అనేక ప్రాంతాల్లో నెలకొంది. సామాన్యుడికి జేబులు చిల్లు పడేలా వుంది.