16-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 16: ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో చేపట్టిన క్యాంపెయిన్ను ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా ప్రారంభించింది. సోమవారం దావోస్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులతో సమావేశ మయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.
అధికారులు కూడా పర్యటనలో భాగమయ్యారు. అంతా కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దావోస్ చేరుకున్న వెంటనే రేవంత్ బృందం ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో సమావేసమైంది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ ఆయనతో చర్చించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్రెసిడెంట్ బోర్గోబ్రెండేతో కూడా సమావేశ మయ్యారు.
ఇతర ప్రముఖులతో కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. స్విట్జర్లాండ్ లోని జూరిచ్ విమానా శ్రయంలోనే ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో రేవంత్ టీం చర్చలు జరిపింది. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి కోసం నవ తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేందుకు వారంతా మొగ్గు చూపారని సిఎం రేవంత్ తెలిపారు.
తెలంగాణలో ఉన్న వనరులు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. భారీ పెట్టుబడుల లక్ష్యంగానే ఈ టూర్ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దావోస్ లో మూడు రోజుల పాటు 54వ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరగనుంది. దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ ట్రెండి బోర్గ్, ఇథియోఫియా డిప్యూటీ పీఎం మేకొనెన్తో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్యం పెంచే అంశాలపై మాట్లాడారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సహ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి ఉన్నారు.
వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సీఈవోలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించి, ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుతుంది. నొవర్తిస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజ్రనిక్, గూగుల్, ఉబెర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు.
మన దేశానికి చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్, సీఐఐ; నాస్కం వ్యాపార ప్రతినిధులతో ఈ రోజు, రేపు సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. వైద్యారోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజల హెల్త్ డేటా రూపొందించే అంశంపై చర్చ జరగనుంది.
ఈ చర్చా గోష్టిలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు యురోపియన్ కమిషన్ ఆరోగ్య ఆహార కమిషనర్, జెనీవా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ అధినేత, ఆక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండ ఐటీ మంత్రి, మయో క్లినిక్ సీఈవో, టకేడా ఫార్మా కంపెనీ సీఈవో పాల్గొంటారు.