ad1
ad1
Card image cap
Tags  

  16-01-2024       RJ

అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్లకు ఛాన్స్: కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ

హైదరాబాద్, జనవరి 16: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను ఖరారు చేస్తూ వారికి సమాచారం ఇచ్చింది. వీటితో పాటు గవర్నర్ కోటాలో కూడా ఇద్దరి పేర్లను కరారు చేసినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయాల్సిన నాలాగు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. పేర్లను ఖరారు చేయగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

గురువారమే నామినేషన్లకు చివరి తేదీ ఉంది. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి గడువు ముగుస్తుంది. అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఈ రెండు స్థానాలు పోటీ లేకుండా కాంగ్రెస్ ఖాతాలోనే పడే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కొడుకు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేశారు. సియాసత్ పత్రిక సంపాదకుడు జాహెద్ అలీ ఖాన్ కుమారుడు అమిర్ అలీ ఖాన్.

జాహెద్ అలీ ఖాన్ కి చాన్స్ ఇవ్వాలనుకున్నా ఆయన రాజకీయ పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఈ నలుగురి ఎంపిక చేశారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేశారు.

తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఇద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు.

అనేక ఉద్యమాలు చేశారు. ఎన్ ఎస్ యూఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. టీఎస్ పీఎస్ సీలో పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేశారు, జైలుకి కూడా వెళ్లారు.ఇక, అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను అనేక వేదికలపై బలంగా వినిపించారు.

కోదండరామ్ కు కాంగ్రెస్ హైకమాండ్ ముందుగానే హామీ ఇచ్చింది. ఆ ప్రకారం ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీ చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.

విదేశీ పర్యటనకు వెళ్లే ముందు రేవంత్ రెడ్డి మొత్తం జాబితాపై కసరత్తు చేసి వెళ్లారు. ఈనెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్కు ఒక ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ కు ఇంకో ఎమ్మెల్సీ వస్తుంది. కానీ, ఎన్నికలసంఘం ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థిదే గెలుపు.

అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యుల బలం ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2 స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే మెజారిటీ ఉన్న కాంగ్రెస్ సభ్యులు రెండుసార్లు ఓటేస్తారు. అలా రెండు స్థానాలూ కాంగ్రెస్ కే దక్కుతాయి.

బీఆర్ఎస్ పోటీ పెట్టే అవకాశం లేదు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిర్రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడంతో ఇద్దరూ గతనెల 9న తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP