16-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తెనాలి, జనవరి 16: రాష్ట్రం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. తెలిసో, తెలియకో రాష్ట్రంలో ఒక పిచ్చి మొక్క నాటామని వ్యాఖ్యానించారు. తెనాలిలో దివంగత నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు నివాసంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన అల్పాహారం చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. తమది రాజకీయ భేటీ కాదని, ఆత్మీయ సమావేశం మాత్రమేనన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయం భాజపా, జనసేన, తెదేపా ముఖ్య నేతలు చూసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. కరెంటు, పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెంచిన ప్రభుత్వం.. రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు తమవంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.