16-01-2024 RJ
తెలంగాణ
రంగారెడ్డి, జనవరి 16: నార్సింగీలో దారుణం జరిగింది. మంచిరేవులలో జంగయ్య అనే వాచ్ మన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు మధ్య వివాదం చెలరేగింది. చినికి చినికి గాలి వానగా మారి జంగయ్యను మేస్త్రి అర్జున్ హత్య చేశాడు. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి..
హంతకుడికి కోసం దర్యాప్తు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్నాప్ అమ్ము కుంటున్నాడనే కోపంతో జంగయ్యపై మేస్త్రి అర్జున్ దాడి చేశాడు. ఈ దాడిలో వాచ్ మెన్ జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన మేస్త్రి అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.