16-01-2024 RJ
సినీ స్క్రీన్
విశ్వంభర కాన్సెప్ట్ వీడియో నెట్టింట 5 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. వశిష్ఠ ముందుగా చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ చిరంజీవి కెరీర్లో టాప్-10 బెస్ట్ సినిమాల జాబితాలో టాప్3లో ఉంటుందని తాజా వీడియోతో అర్థమైపోతుంది. వశిష్ఠ కట్ చేసిన టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 2023లో దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేయగా.. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రానికి పనిచేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఇప్పటికే అప్ డేట్ ఇచ్చేశారు ఎంఎం కీరవాణి.
ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ లాంఛ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్ను అందించడానికి మేమంతా సిద్ధం.. అంటూ డైరెక్టర్ వశిష్ఠ సినిమా అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై క్యూరియాసిటీని తెగ పెంచుతున్నాడు.