17-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 17: తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగే రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు రూపకల్పనలో భాగంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చేసిన ప్రకటన డొల్ల అని తేలిపో యింది. ప్రాజెక్టుల పేరుతో అప్పులకుప్పను తయారు చేసి పెట్టారు. నోట్లతో కాలేశ్వరం కట్టారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చేపట్టాక స్పష్టం చేశారు.
రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగేలా కాల్వలు, చెక్ డ్యామ్లను నిర్మించాల్సి ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలతో పాటు రిజర్వాయర్ల నిర్మాణాలతో శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం దక్కగలదని భావించారు. కానీ ఇదంతా ఓ ధనయజ్ఞంగా మారిందని ఆలస్యంగా తేలింది.
గతంలో ప్రతిపాదించిన గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లు ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఫలితాలుంటాయి. తెలంగాణలో ఉన్న మంజీరా, దుంధుబి, కనగల్వాగు, ముసీ, పాకాల లాంటి ఉపనదుల మీద చెక్ డ్యాంల నిర్మాణం జరగాలి.
ఒక్కసారి ఈ చెక్ డ్యాంలు, చెరువులు పూర్తిగా నిండితే పంటలు పండుతుంటాయి. గోదావరి నదిపై కడుతున్న బ్యారేజీల వల్ల ఉత్తర కరీంనగర్ జీవధారగా అవుతుందంటున్నారు. సింగూర్ నిండితే మెదక్ జిల్లాకు మెతుకుసీమ పేరు సార్థకమవుతుందని తెలిపారు. ఎస్సారెస్పీ ఎప్పటికీ నిండి నీళ్లతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై మిషన్ భగీరథ ఆధారపడి ఉందని, మిడ్ మానేరు నీళ్లు వచ్చే నాటికి బ్యారేజీలన్నీ పూర్తికావాల్సి ఉంది. కాల్వల నిర్మాణం, చెక్ డ్యాంల నిర్మాణం, చెరువులు నింపుకోవ డానికి ఏర్పాట్లు పూర్తియితే ఆశించిన ఫలితం దక్కగలదు.
అప్పర్ మానేరు నుంచి లోయన్ మానేరు ఒక జీవధార లాంటిది. కాకతీయ కాలువ మరో జీవధార. గోదావరి మీద కడుతున్న బారేజీల వల్ల ఉత్తర కరీంనగర్ కూడా ఒక జీవధార లాగా అవుతుందని నమ్మించారు. కానీ కాళేశ్వరం ఇప్పుడు మెయింటెన్ చేయడమే ఓ సమస్యగా మారింది. దీనికి విపరీతమైన విద్యుత్ ఖర్చు కానుంది. సింగూరు ఒక్కసారి నిండితే ఐదు సంవత్సరాల దాకా ఇబ్బంది ఉండదు. సింగూర్ నుంచి కొండపోచమ్మ, మల్లన్నసాగర్ వరకు జీవధారే. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎప్పటికీ నిండి నీళ్లతో ఉండాల్సిన అవసరం ఉంది.
మిడ్మానేరు నీళ్లు వచ్చే సరికి బ్యారేజీలన్ని పూర్తి కావాలి. కరువు ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను పూర్తిగా సమీక్షించాల్సి ఉంది. వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి ఉపయోగంలోని రావాలంటే చెరువులు నింపడం తప్పనిసరి.